Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌, ఢిల్లీల్లో ఈడీ సోదాలు

జార్ఖండ్‌, ఢిల్లీల్లో ఈడీ సోదాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూకుంభకోణం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం జార్ఖండ్‌, ఢిల్లీలో సోదాలు నిర్వహించిందని అధికారులు వెల్లడించారు. రాంచీ జిల్లాలోని కాంకే బ్లాక్‌లో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కమలేష్‌ కుమార్‌ అతని సహచరులు సర్కిల్‌ అధికారులతో కుట్ర పన్ని.. అక్కడున్న భూమి రికార్డులను నకిలీ చేసి వాటిని అమ్ముకుని.. డబ్బులు సంపాదించారు. ఈ నేరం కిందనే మంగళవారం ఇడి అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడు కమలేష్‌ కుమార్‌ సహచరుడైన బి.కె సింగ్‌తోపాటు మరికొందరు వ్యక్తుల ఇళ్లపై దాడులు చేశారు. రాంచీలో ఆరు, ఢిల్లీలో మూడు ప్రదేశాల్లో ఇడి దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -