Sunday, May 18, 2025
Homeఅంతర్జాతీయంఇటలీ ప్రధానికి అదిరిపోయే ఆహ్వానం ప‌లికిన ఎడీ రమా

ఇటలీ ప్రధానికి అదిరిపోయే ఆహ్వానం ప‌లికిన ఎడీ రమా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు అల్బేనియా రాజధాని టిరానాలో జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సదస్సుకు విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అల్బేనియా దేశాధినేత ఎడీ రమా మోకాలిపై కూర్చుని ఆహ్వానించారు. మెలోనీ కారు దిగి వస్తుంటే ఎడీ మోకాలిపై కూర్చుని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది.కాగా ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చుని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -