నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్‌కు చెందిన ప్రముఖ పత్రిక గుజరాత్ సమాచార్ ఓనర్ బాహుబలి షాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్ సమాచార్ ఆఫీసు పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. లోక్ ప్రకాశన్ లిమిటెడ్ సంస్థకు ఆయన డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. బాహుబలి షా సోదరుడు శ్రేయాంశ్ షా.. గుజరాత్ సమాచార్ డెయిలీ పత్రికకు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. జీఎస్టీవీ డిజిటల్ సర్వీసెస్ హెడ్‌గా తుషార్ దేవ్ ఉన్నారు. అయితే ఆ ఛానల్ శ్రేయాంశ్‌దే. శుక్రవారం తెల్లవారుజామున బాహుబలి షాను ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ పై ఈడీ అధికారులు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ఆయన అరెస్ట్ పై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రతిపక్షనేత రాహుల్ గాందీ స్పందించారు. దేశం భయంతో కాదు, నిజంతో నడుస్తుందని, గుజరాత్ సమాచార్ సహ వ్యవస్థాపకుడు బాహుబలి షా నిర్బంధాన్ని ఆయన ఖండించారు.
గుజరాత్ సమాచార్ పత్రిక కో-ఫౌండర్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES