Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరక్షరాస్యులకు విద్య నేర్పండి

నిరక్షరాస్యులకు విద్య నేర్పండి

- Advertisement -

– మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య 
– ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
సావిత్రిబాయి పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థినిలు ఉన్నత విద్యావంతులుగా తయారు కావాలని, నివసించే ఇంటి చుట్టుపక్కల ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి చదువు నేర్పాలని మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య అన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలను ఆనాడు విద్యకు దూరంగా ఉంచారని, అలాంటి సమయంలో సావిత్రి బాయి పూలే ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. మండలంలోని చౌట్ పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

హాస కొత్తూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు వర్ష, శ్రీలత, ప్రవళిక, డీజే లత, నవ్య లను  పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ ఆంధ్రయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థినిలు ఉన్నత విద్యావంతులుగా తయారు కావాలన్నారు. నివసించే ఇంటి చుట్టుపక్కల ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి చదువు నేర్పాలని సూచించారు. అందరూ విద్యావంతులు అయినప్పుడే మోసాలు తగ్గుతాయని, తల్లి విద్యావంతురాలు అయితే  ఆ కుటుంబం పరోక్షంగా గ్రామం కూడా  అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -