Wednesday, October 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు

మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన మోహన్ బాబు యూనివర్సిటీకి ఊహించని షాక్ తగిలింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. వివరాల్లోకి వెళితే.. గడిచిన మూడు సంవత్సరాలుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పలువురు విద్యా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం విచారణ జరిపిన విద్యా కమిషన్.. విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం నిజమేనని తేల్చింది. దీంతో విచారణ అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యా కమిషన్ సిఫార్సుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -