- Advertisement -
– వైద్యుడు అశోక్ రెడ్డి సూచన
-విద్యార్థినికి రూ.10 వేల ప్రోత్సాహక నగదందజేత..
నవతెలంగాణ-బెజ్జంకి : చదువు..భవిప్యత్తుకు నిధి వంటిదని..విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కరీంనగర్ పట్టణలోని ఏఆర్ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వైద్యుడు దారం అశోక్ రెడ్డి సూచించారు.మండల పరిధిలోని కల్లేపల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో పదిలో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని తాళ్లపల్లి దీప్తికి ప్రోత్సాహకంగా రూ.10 వేల నగదును వైద్యుడు అశోక్ రెడ్డి మంగళవారం ఆస్పత్రి యందు అందజేశారు.గ్రామంలోని విద్యార్థులందరూ ఉత్తమ ఉత్తీర్ణత సాధించి గ్రామానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని వైద్యుడు తెలిపారు.
- Advertisement -