- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
విద్య ప్రమాణాలు మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా విలువైనదని మంగళవారం మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు అన్నారు. మండలంలోని మానవ వనరుల కేంద్రంలో ఉపాధ్యాయులకు మండల స్థాయి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ.. ఎఫ్ ఎల్ ఎన్ బోధన విధానాలు, మౌలిక సామర్ధ్యాల సాధన, కనీస అభ్యాసన సామర్ధ్యాల సాధన, సంసిద్ధత పాఠాల నిర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, ఎల్లయ్య, శివకృష్ణ, ప్రశాంత్, పురం శ్రీ నివాస్, జోష్ణ దేవి, సీఆర్పీలు మహమ్మద్, సురేఖ, యుగేందర్, ఎం ఐ ఎస్ అజీమ్, మౌనిక, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -