Saturday, February 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలోని అన్ని గమ్యస్థానాలకు తమ విమాన సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యలు ప్రారంభించడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇవాళ‌ ఇరాన్‌పై సమన్వయంతో దాడులు ప్రారంభించాయి. ఈ పరిణామంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ మరింత విస్తరిస్తే సుదూర భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా ముందుజాగ్రత్త చర్యగా విమానాలను రద్దు చేసింది. “మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే అన్ని విమానాలను నిలిపివేస్తున్నాం. భద్రతా వాతావరణాన్ని నిరంతరం అంచనా వేస్తూ, అవసరమైన మేరకు మా ఆపరేషన్లను సర్దుబాటు చేస్తాం” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభావితమైన ప్రయాణికులకు తమ బృందాలు అన్ని విధాలా సహకరిస్తాయని హామీ ఇచ్చింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో లేదా 91 1169329333, 91 1169329999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా 24 గంటల కాల్ సెంటర్‌ను సంప్రదించి తెలుసుకోవాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -