-మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్ : పాఠశాల స్థాయి వరకు విద్యార్థులందరిలో చదివే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయడానికి రూమ్ టూ. రీడింగ్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి రూమ్ టూ రీడింగ్ మండల కోఆర్డినేటర్ భవాని అన్నారు. సోమవారం రాయపోల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూమ్ టూ రీడ్ ఇండియా గేట్స్ రీడింగ్ కార్యక్రమంలో భాగంగా మండలంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమైనదన్నారు. పాఠశాలలో రూమ్ టూ రీడింగ్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రోగ్రాం జరుగుతుందన్నారు.విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలని, విద్యార్థులలో పుస్తకాలు చదవడం చాలా తగ్గిందని విద్యార్థులంత ప్రతిరోజు తప్పకుండా అర్థగంట పుస్తకాలు చదవాలని పేర్కొన్నారు. పిల్లలకు ఎంతో ఆసక్తికరమైనటువంటి కథల పుస్తకాలను ప్రతి పాఠశాలకు అందించడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు విద్యార్థులను అర్ధగంట చదివించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES