Thursday, March 26, 2026
E-PAPER
Homeజాతీయంఏక్ కచోరీ, ఏక్ సమోసా అబ్ నహీ రహా గ్యాస్ పర్ భరోసా:అఖిలేష్ యాద‌వ్

ఏక్ కచోరీ, ఏక్ సమోసా అబ్ నహీ రహా గ్యాస్ పర్ భరోసా:అఖిలేష్ యాద‌వ్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియా యుద్ధంతో దేశంలో గ్యాస్ సంక్షోభం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగాదారులు ప‌డిగాపులు కాస్తున్నారు. మ‌రో వైపు పెట్రోల్ బంకుల ముందు జ‌నాలు బారులు తీరుతున్నారు. ఈ ప‌రిణామాల‌పై స‌మాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ (SP) మోడీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. మోడీ స‌ర్కార్ నిర్ల‌క్ష్య వైఖ‌రితో స‌బ్బండ వ‌ర్గాలు అనేక క‌ష్టాలు ప‌డుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీసీలు, ద‌ళితులు, మైనార్టీలు బీజేపీ అనాలోచిత‌ నిర్ణ‌యాలతో రోడ్డు మీద ప‌డ్డార‌ని, గ్యాస్, పెట్రోల్ కోసం ప‌డిగాపులు కాస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ దుస్థితికి బీజేపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు. మోడీ నిర్ణయాల‌తో ప్ర‌తి ఒక్క‌రూ రోడ్డు మీద ప‌డ్డామ‌న్నారు. కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం సామాన్య ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను గుర్తించిలేక‌పోయిందని, విష‌త్తుక‌ర ప‌రిస్థితుల్లో వారి సాదాక‌బాదాల‌ను మోడీ ప్ర‌భుత్వం ఎలా తీర్చుతుంద‌ని, అట్ట‌డుగు వ‌ర్గాల క‌ష్టాల‌ను ఎలా తీర్చుతార‌ని ప్ర‌శ్నించారు.

‘‘బీజేపీ ఇచ్చింది క్యూలైన్‌లు తప్ప మరేమీ కాదు. వారి నిర్ణయం ఏదైనా, అది నన్ను, మిమ్మల్ని, ప్రతి ఒక్కరినీ ఒక వరుసలో నిలబెడుతుంది. కానీ ఈసారి, వరుసలో నిలబడి వారిని ఓడించడానికి కృషి చేయాలని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే వారు పీడీఏ(Backward Classes, Dalits, and Minorities)కు భయపడుతున్నారు. “ఏక్ కచోరీ, ఏక్ సమోసా అబ్ నహీ రహా గ్యాస్ పర్ భరోసా (ఒక కచోరీ, ఒక సమోసా, ఇకపై గ్యాస్ సిలిండర్లపై నమ్మకం లేదు),” ఎల్పీజీని ‘లపటా గ్యాస్‌’’ అని ఆయ‌న‌ ల‌క్నో మీడియా స‌మావేశంలో అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -