- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: షాబాద్ మండలంలోని నాగర్ గూడలో శనివారం ఉదయం స్కూల్ బస్సు ఢీకొని 75 ఏళ్ల గుత్తి లచ్చయ్య మృతి చెందారు. చేవెళ్ల నుంచి ఇంటికి వస్తుండగా, నాగర్ గూడ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు శ్రీ చైతన్య స్కూల్ బస్సు లచ్చయ్యను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన లచ్చయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని లచ్చయ్య మనవడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



