నవతెలంగాణ – ఆలేరు టౌను
మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని, ఆలేరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్, ఆర్డీవో కృష్ణారెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులతో, ఎన్నికల నిర్వహణలో ఒక లక్ష రూపాయల ఖర్చు వివరాలు పొందుపరచడం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, డబ్బించి తమా గురించి గొప్పగా పెడార్టికల్ రాయించుకోవద్దన్నారు. న్యూస్ ని డిక్లేర్ చేయడానికి ప్రతి మున్సిపల్ పరిధిలో, వీడియో ఒకటి ఉంటదని, ఆ వీడియోస్ చూసి వాళ్ళు ఇది నిజమైనటువంటి వార్తన, లేకుండా ఒక అభ్యర్థికి అనుకూలంగా రాయించుకున్నారా, నిర్ధారణ చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి, రాబోయేటటువంటి మూడు ఎన్నికలకు పోటీ చేసే అవకాశం ఉండదు అన్నారు. కేసులు నమోదు చేస్తామన్నారు. డిస్టిక్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చు ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రచార సమయంలో తర్వాత, పోస్టు ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీ యాక్టివిటీ ఏంటిది అనేది తెలుసుకుంటామన్నారు.
బ్యాంక్ అకౌంట్ ద్వారా, క్యాష్రూరుపేనా పదివేల వరకు ఒక రోజులో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అంతకు మించిందైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలని, దేనికి ఖర్చు చేస్తారు, జెండాలు కావచ్చు, మీ ఫ్లెక్సీలు కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, సభలు ,ర్యాలీలు సంబంధించి, రోజువారి ఖర్చుల వివరాలు ఇవ్వాలని సూచించారు. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఫస్ట్ పేజీలో మీ వ్యక్తిగత వివరాలు మాత్రమే ఉన్నాయి మీ పేరు మీరు ఏ వాటర్ నుండి పోటీ ఇల్లు కావచ్చు తర్వాత మీ పాంప్లెట్స్ గాని మీ ఫ్లెక్సీలు గాని ఇవన్నీ కూడా మనకు రేట్ చార్ట్ అని ఉంది లోకల్ మార్కెట్ల ప్రకారము అన్ని వర్గాలతోని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా కలెక్టర్ గారు ఒకరేట్ చాట్ ఫైనలైజ్ చేశారు.
పూలదండలు కావచ్చు పటాకులు కావచ్చు స్వీట్స్ కావచ్చు స్వీట్లు ఓడిపోయిన వాళ్లు కూడా తప్పనిసరిగా వాళ్ళ ఖర్చు వివరాలు ఇవ్వండి. ఆక్ట్ 2019 లోని సెక్షన్ల మేరకు ఆ సెక్షన్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నియమనిబంధనలు ప్రత్యేకమైన శిక్షణలో ఉన్నాయి 235 సెక్షన్ లో ఉన్నాయి దాని ప్రకారము మీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు అంటే తదుపరి ఎన్నికల్లో మూడు సంవత్సరాల వరకు పోటీ చేయరు ఆ ఎన్నికలు కూడా ఈ మధ్యలో కదా అనుకోవద్దు ఆలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి మాట్లాడుతూ డబ్బుల పంపిణీ మద్యం సరఫరా గురించి కంప్లైంట్ వచ్చినట్లయితే కేసులు నమోదు చేయబడతాయన్నారు. పోటీ చేయు అభ్యర్థుల జాబితాలో క్రమసంఖ్య, అభ్యర్థి క్రమసంఖ్య నమోదు చేయబడింది అన్నారు. కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సభ్యులు, 12 వార్డులలో మీ నెంబర్ ఏది అనేది చూసుకోవాలన్నారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, ఎన్నికల ఆర్ఓలు, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, బీఎస్పీ పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



