ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్-ఇ.సి) తాజాగా విడుదల చేసిన అడ్వర్టయిజ్‌మెంట్ల హడావుడి పచ్చి కపటత్వానికి పరాకాష్టగా వుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా తాను చేపట్టిన ప్రత్యేక సమగ్రఓట్ల పరిశీలన (సర్)లో అందరినీ కలుపుకుని పోతున్నట్టు చాటుకునేందుకే అది ఉద్దేశితమైంది. ఈప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీ లూ పాల్గొంటున్నాయని ఆ అడ్వర్టయిజ్‌మెంట్ చెబుతున్నది. ఇప్పటివరకూ దేశంలో తీసుకువచ్చిన ఎన్నికల సంస్కర ణలన్నీ ఇ.సి, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతోనే జరిగాయి. ఆఖరుకు ఎన్నికల ప్రవర్తనా నియ మావళి (ఎం.సి.సి) కూడా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం ప్రాతిపదికతోనే రూపొందింది. ఎం.సి.సికి ఎలాంటి రాజ్యాంగ ఆధారం లేకున్నా ఈ పద్ధతికి ఉన్న బలం, దృఢత్వం వల్ల దాని అమలుకు సవాళ్లు లేకుండా పోయాయి. బీహార్‌లో సర్ నేపథ్యంలో జాతీయ పార్టీలన్నీ ఇ.సితో చర్చలు జరిపినా ఈ భారీ కసరత్తు చేపట్టబోతున్నట్టు కనీస సూచనగా కూడా చెప్పింది లేదు. కనుక ఇ.సి చెబుతున్నట్టు ఇది అందరి భాగస్వామ్యంతో నడుస్తున్నదనడం కన్నా సత్యదూరం మరేమీ వుండదు.
ఏమైనా, ఈ విషయంలో మొదటి దశలో ఇ.సి ఒక బూటక లక్ష్యం వెల్లడించిన తీరులోనే తేలిపోయింది. ఇది అత్యంత ఆందోళన కలిగించేదని. ఇది ఏ విధంగానూ పున:పరిశీలన కానే కాదు. నిజానికిది మొత్తం తిరగదోడే తతంగం.స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పిన తీరు మౌలికంగా వయోజన ఓటింగు హక్కు ప్రాతిపదిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి గొప్ప నమూనాగా తీర్చిదిద్దబడింది. మొదటి ఎన్నికల కమిషనర్ దీనికి రెండు ప్రాథమిక కొలబద్దలపై వాస్తవ రూపమిచ్చారు. మొదటిది-సర్వజనులకూ ఓటు హక్కు ఇవ్వడం. రెండవది-ఓటర్ల జాబితా రూపకల్పన బాధ్యత ఎన్నికల సంఘానిది తప్ప వ్యక్తిగతంగా ఆ ఓటర్లపై వుంచకపోవడం. రాజ్యాంగంలోని 326వ అధికరణం సార్వత్రిక ఓటు హక్కు కల్పించాలని స్పష్టంగా చేస్తున్న నిర్దేశం వల్లనే ఇది జరిగింది.
పౌరసత్వ బాధ్యత ఎక్కడీ
పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఏ సమయంలోనూ ఓటరుపై పెట్టింది లేదు.326వ అధి కరణాన్ని గనక లోతుగా పరిశీలిస్తే ఓటు హక్కు సార్వత్రిక కల్పనపై తప్ప పౌరసత్వంపై వక్కాణింపు ఇవ్వలేదు. ఓటర్ జాబితాల పరిశీలన నిరంతరం జరుగుతుంటుంది. ఆ విధంగా తాజా పర్చే ప్రక్రియకూ భరోసా వుంటుంది. ప్రస్తుత ఇ.సి పరమ పవిత్రమైందిగా చెబుతున్న 2003 ఓట్ల సవరణలో కూడా ఓటర్ల నుంచి పౌరసత్వ ఆధారం ప్రత్యక్షంగా అడిగింది లేదు. ఇ.సి పాత రికార్డులు, ఆ కాలపు మీడియా నివేదికలు ఈ వాస్తవానికి నిదర్శనంగా వున్నాయి. కానీ సర్ ప్రక్రియ కృత్రిమంగా సృష్టించిన పేరు గనకే ఈ రికార్డులలో ఎక్కడా కనిపించదు. అది సమగ్రమైంది కాదు, స్థూలమైందీ కాదు. ఇది పౌరసత్వాన్ని నిరూపించే బాధ్యత ఓటరుపై మోపుతున్నది. మొదటి నుంచి అనుసరిస్తున్న ప్రాథమిక సూత్రాలకే ఇది వ్యతిరేకం.
జులై 27న ఇ.సి విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు 7.24 కోట్ల నమోదు (ఎన్యూమరేషన్) పత్రాలు సేకరించ బడ్డాయి. ఈ పేర్లు మాత్రమే రిజిస్టర్‌లో చోటు పొందుతాయి. కానీ 2025 జూన్ 24న సర్ ప్రారంభించిన రోజున రాష్ట్ర ఓటర్ల జాబితాలో 7.89 కోట్ల ఓట్లు వున్నాయి. మిగిలిన వారు చనిపోయారనీ (22 లక్షల మంది) తమ నివాసాన్ని శాశ్వతంగా మార్చుకోవడమో లేక ఆచూకీ తెలియకపోవడమో (36 లక్షలు) జరిగిందనీ, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల నమోదైనారనీ (7 లక్షలు) ఇ.సి చెబుతున్న మాట. తక్కిన వారు కారణమేదైనా ఓటరుగా నమోదు చేసు కోవడానికి ఇష్టపడటం లేదని (వీరి సంఖ్య చెప్పడం లేదు) అంటున్నది. సర్ ఉత్తర్వు ప్రకారం ఈ 65 లక్షల మందికి ఓటర్ల జాబితా డి.ఇ.ఆర్ లో చోటు వుండదు.
అంత వేగంగా ఎలా తేల్చారు?
నిజంగా ఇంత పెద్ద సంఖ్య చాలా ఆందోళన కలిగిస్తుంది. 2020 ఎన్నికలలో బీహార్ ఓటర్ల సంఖ్య 7.36 కోట్లయితే 2025లో అంతకన్నా తక్కువగా వుంటుందన్న మాట. గత రికార్డులను బట్టి చూస్తే ఇది అత్యంత అసా ధారణ పరిణామం. అదే అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎవరైనా సరే శాశ్వతంగా రాష్ట్రం నుంచి వలస వెళ్లిపో యారని నిర్ధారించే ముందు ఒక్కొక్కరి విషయమై క్షుణ్ణంగా విచారణ జరపాల్సిన అవసరం వుండదా? కేవలం 30 రోజులలో 36లక్షల మంది వ్యక్తులు శాశ్వతంగా వలస పోయారని విచారణ చేయడం ఎలా సాధ్యమవుతుంది? బీహార్‌కు చెందిన వలస కార్మికులపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం వారిలో 90 శాతం మందికి ఈ ఫారాలు సమర్పించడం మాట అటుంచి అసలు సర్ గురించి తెలియనే తెలియదు.ఇక పెద్దసంఖ్యలో చనిపోయినట్టుగా ప్రకటించిన వారి విషయానికి వస్తే 2025 సంపూర్ణ జాబితాలో ప్రస్తావనే లేకుండా దీన్ని ఎలా నిర్ధారిస్తారన్నది కూడా ప్రశ్న. ఒక్కసారి గనక అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా మొత్తం డి.ఇ.ఆర్ ప్రచురించినట్టయితే ఇది మరింత స్పష్టమవుతుంది. తీవ్రమైన తేడాలున్నట్టు అర్థమవుతుంది.
ఇ.ఆర్ లెక్క తీవ్ర తేడా
జాబితా ప్రామాణికత గురించి ఒక అంచనాకు రావడానికి వీలుగా ప్రముఖ సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ ఓటరు జనాభా నిష్పత్తి (ఇ.ఆర్) అనేది రూపొందించారు. జులై నెల మొదట్లోనే బహుళ పార్టీల ప్రతినిధి వర్గం కలుసుకున్నప్పుడు బీహార్ ఓటర్ల జాబితాలో 20 శాతం బూటకమని సి.ఇ.సి ప్రకటించారు. ఆ కారణంగా వాటిని తొలగించాలని సి.ఇ.సి చెప్పిన నేపథ్యంలో ఈ లెక్క అవసరమవుతుంది. అసలు మొత్తం ప్రక్రియ ముగియ కుండానే ఇలాంటి నిర్ధారణ ప్రకటించడమంటే దాన్ని ముందే నిర్ణయించారనీ, ఇష్టానుసారం నిర్ణయించారని భావిం చాల్సి వుంటుంది. జనాభా అంచనాలపై సాంకేతిక బృందం నివేదిక (2019) లోనూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాల వారీగా సంవత్సరాలు, వయస్సుల వారీగా జనాభా లెక్కల ప్రాతిపదికన తయారు చేసిన అంచనాలు ఇందుకు అత్యుత్తమమైన ఆధారవనరుగా వుంటాయి. ఇటీవల అంటే జనవరి 2025లో కూడా భారత ప్రభుత్వం, ఇ.సి.ఐ లు ఈ అంకెలనే ఉపయోగించుకున్నాయి. డి.ఇ.ఆర్ లో అర్హులైన ఓటర్ల సంఖ్యను ఆ వయస్సుల వారీ సంఖ్యతో భాగిస్తే ఇ.ఆర్ నిష్పత్తి వచ్చేస్తుంది.
ఈ స్కోరు వంద శాతం వస్తే బాగా చక్కగా సరిపోయినట్టు భావించాలి. 2024లో చూస్తే ఈ అఖిల భారత స్కోరు 99 శాతం వుంది. తేడా ఒక్క శాతమే గనక ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి. 97 శాతం స్కోరుతో బీహార్ జాతీయ సగటు కంటే కొంత వెనకబడి వుంది. అంటే ఆ ఓటర్ల జాబితా పెంచడంగాక కొంచెం తగ్గించబడిందని భావించాలి. జూన్ 24న సర్ ప్రకటన వెలువడిన రోజున బీహార్‌లో ఇ.ఆర్ నిష్పత్తి 97 శాతం. అప్పటికి ఇ.సి చెప్పినట్టు సర్ ప్రకారం మరింత కుదించక ముందే అంత తక్కువగా వుందన్నమాట. గత అయిదు ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఆకస్మికమైన తీవ్రమైన తగ్గుదల. అంతేగాక మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా తక్కువగా వుంది.
సర్‌పై పోరాటమే
సర్ ప్రక్రియ మధ్యలో వుండగా ఇ.సి పున:పరిశీలన నిబంధనలు మార్చింది. తను అడిగిన పదకొండు పత్రాలు ఇవ్వకపోయినా కేవలం తానిచ్చిన దరఖాస్తు ఫారాలు తిరిగి సమర్పించినా సరిపోతుందని మార్చింది. అయితే ఇప్పుడు ఈ తొలగింపులకు కారణాలు వెల్లడించే సమయంలో మనం కోరితే ఆ వివరాలతో పాటు ఆ పత్రాలన్నీ వెల్లడిస్త్తుందో లేదో చూడాలి.
బీహార్‌లో సర్ కసరత్తు ఇప్పటి వరకూ అస్తవ్య స్తంగా జరిగినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. సరైన విశ్వసనీయ ఆధారాలు కూడా లేకుండానే జరిపించేశారు. అకస్మాత్తుగా పారదర్శకత లేకుండా ముగించేశారు. ఈ నేపథ్యంలో చూస్తే సర్ ఒక మోస పూరిత వ్యవహారంగా చెప్పవలసి వుంది. ఇదే సందర్భం లో ఒక్క కొత్త ఓటైనా చేరినట్లు ఇ.సి చెప్పలేదు. ఇది ఏ విధంగా చూసినా అడ్డగోలు తతంగమే. సుప్రీంకోర్టు చెప్పినట్టు విస్తృతంగా ఓట్ల చేర్పుగాక ‘సామూహిక తొలగింపు’ కోసమే చేసిందన్న మాట.
కనుక బీహార్‌లో ఓటుచేసే హక్కు అన్న రాజ్యాంగ హక్కును కాపాడుకోవడం కోసం పోరాటం సాగించేం దుకు ముందుకు సాగండి. ఒకవేళ ఇ.సి గనక దాన్ని ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తానని పట్టు పట్టేట్ట యితే ఈ పోరాటం దేశ వ్యాపిత పోరాటం అవుతుంది.
(ఆగస్టు 5 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
బీహార్‌లో ఎన్నికల సంఘం ఘరానా మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES