నవతెలంగాణ-హైదారాబాద్: భారత్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఢిల్లీ వేదికగా ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు తన వెబ్ సైట్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానికంగా ఉన్న రోషినా రోడ్డులోని జాతీయ మీడియా కేంద్రంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇటీవల బీహార్‌లో SIR పేరుతో సవరించిన ఓటర్ జాబిత మూసాయిదాను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ అనంతరం ఎన్నికల సంఘం తొలిసారిగా మీడియా ముందుకు రానుంది.
మరోవైపు ఎస్ఐఆర్ పేరుతో బీహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. SIR పేరుతో ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తూ..ఇండియా బ్లాక్ కూటమి పార్టీలతో రేపు ఓట్ అధికార్ యాత్రకు తలపెట్టారు. ఈ యాత్రకు విపక్షాలు మద్దతు తెలిపాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీహార్ SIR చర్చ జరగాలని..ఇండియా బ్లాక్ కూటమి ఎంపీలు..శాంతియుతంగా ఈసీ కార్యాలయానికి ర్యాలీ చేపట్టగా..పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.