- Advertisement -
– జాతీయ కన్వీనర్‌గా లలిత బలన్
– తెలంగాణ నుంచి బి.పద్మ, ఏపీ నుంచి శివనాగరాణికి చోటు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళలోని మలప్పురం జిల్లా పరిమన్న నగరంలోని ఈఎంఎస్ అకాడమీలో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక, రూరల్ వర్కర్స్ మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. 16 రాష్ట్రాల నుంచి 410 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహిళా సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చించారు. అనంతరం 19 మందితో అఖిల భారత సబ్ కమిటీ ఎన్నికైంది. ఈ మేరకు సోమవారం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ప్రకటన విడుదల చేశారు. కేరళకు చెందిన లలిత బలన్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బి. పద్మ, ఆంధ్రప్రదేశ్ నుంచి శివనాగ రాణికి ఇందులో చోటు లభించింది.
- Advertisement -