Tuesday, February 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వాయిదా పడ్డ క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

వాయిదా పడ్డ క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

- Advertisement -

– మున్సిపల్ కార్యాలయంలోపల సీపిఐ, బీఆర్ఎస్ నాయకుల ఆందోళన 
నవతెలంగాణ – మంచిర్యాల : క్యాతనపల్లి మున్సపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారాయి.22 వార్డులకు ఎన్నికలు జరగగా 10 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్, 4 సీపిఐ, ఇండిపెండెంట్ 1 గెలుపొందరు. మెజారిటీ స్థానాలు జత కట్టిన సీపీఐ, బిఆర్ ఎస్ కు ఉండగా ఆదివారం జరగాల్సిన ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నిక కోరం లేక సోమవారానికి వాయిద పడింది. సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం లో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నిక జరగనుండగా మరోసారి వాయిదా పడింది. కార్యాలయం లోపల పలువురు సభ్యుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది.అదే సమయం లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన 7 గురు సభ్యులు మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ తో కలిసి మధ్యలోనే బయటకి వెళ్లిపోయారు. దీంతో మరోసారి ఎన్నికలు వాయిద పడ్డాయి.ఎక్స్ సఫిషియంట్ గా ఉన్న ఎమ్మెల్యే వివేక్, ఎంపి గడ్డం వంశీ ఎన్నికలకు హాజరైనప్పటికి ఛైర్మెన్ వైస్ చేర్మెన్ ఎన్నిక జరగక పోవడం వివాదస్పధం గా మారింది.దీంతో మున్సిపల్ కార్యాలయం లోనే బిఆర్ఎస్, సీపిఐ సభ్యులు ఆందోళనకు దిగారు.కలెక్టర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.గత రెండు రోజులుగా క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చేర్మెన్ ఎన్నికల పై సందిగ్ధత కొనసాగుతునే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -