Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిఎంపిఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక...

జిఎంపిఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిఎంపిఎస్ మండల నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా  దేవునూరి బాలయ్య, పాక జహంగీర్ ఎన్నికైనట్లు జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ తెలిపారు. జిఎంపిఎస్ మండల కమిటీ ఎన్నిక శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. వారితో పాటుగా మండల ఉపాధ్యక్షులుగా  పార్వతి దశరథ, తోటకూరి అశోక్, సహాయ కార్యదర్శిగా వడ్డే జమదగ్ని, వడి నాగరాజు, కోశాధికారిగా గంగనబో యిన పాండు, మండల కార్యవర్గ సభ్యులుగా ఏశ బోయిన అంజయ్య, గజ్జి నరసింహ, మన్నెబోయిన రాజలింగం, కదిరే జంగయ్య, తెలజురి మల్లేష్, బిట్కూరి లక్ష్మయ్య,  మదిరే రాజయ్య, కుకుట్ల కృష్ణ, రసాల చంద్రయ్య లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండవసారి ఎన్నిక చేసినందుకు తమకు మరింత బాధ్యత పెరిగిందని, గొర్రెల మేకల పెంపందర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని తెలిపారు. తమ ఎన్నికలకు సహకరించిన  గొర్రెల మేకల పెంపందారుల జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు,  గొర్ల కాపరులకు  కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -