నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీఫికేసన్ జారీ చేయడమే తరువాయి. అదే విధంగా సర్ రెండో విడతలో భాగంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణను ఈసీ మొదలు పెట్టింది.
తాజాగా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. అందుకు పోలింగ్ మిషన్లను సన్నద్దం చేస్తుంది.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీ, ఓటింగ్ రిహార్సల్ ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ భారతి కోల్‌కతాలో ఫస్ట్ లెవల్ చెకింగ్ (FLC) బృంద సభ్యులతో జరిగిన సమావేశానికి నాయకత్వం వహించారు. SIR, EVM, VVPATల సన్నాహాలు, ఇతర విషయాలపై చర్చించినట్టు సమాచారం.
2026 అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,000 పోలింగ్ బూత్‌లు పెరుగుతాయని ECI తెలిపింది. 2021 ఎన్నికలలో, రాష్ట్రంలో 80,681 బూత్‌లు ఉన్నాయని, 2026 నాటికి ఈ సంఖ్య దాదాపు 95,000కి పెరుగుతుందని అంచనా వేసింది. ప్రతి బూత్‌కు సరిపడా యంత్రాలను కలిగి ఉండేలా చూసుకోవడానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ప్రస్తుతం 1.30 లక్షల EVMలు (బ్యాలెట్లు + కంట్రోల్ యూనిట్లు, రిజర్వ్‌లతో సహా) 1.35 లక్షల VVPAT యంత్రాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది.



