- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద పార్క్ చేసి ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
- Advertisement -



