Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్లలో తెగిప‌డిన‌ విద్యుత్ తీగలు..మరమ్మతులు చేయరా..!

పెద్దతూండ్లలో తెగిప‌డిన‌ విద్యుత్ తీగలు..మరమ్మతులు చేయరా..!

- Advertisement -
  • ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేద‌న్న‌ బాధిత రైతులు

నవతెలంగాణ-మల్హర్ రావు: గత మే నెలలో ఈదురు గాలివాన బీభత్సం సృష్టించడంతో మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో అరేవాగు ప్రక్కన లంబడికుంట దగ్గర ట్రాన్స్ ఫార్మర్లు,విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈక్ర‌మంలో మంగళవారం మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోయారు. అసలే ఖరీప్ సీజన్ ప్రారంభం కావడంతో పొలాలు నాట్లు వేసేందుకు సిద్ధంగా నార్లు పెరిగాయని, విరిగిన ట్రాన్స్ పార్మర్లు, విద్యుత్ పొల్లు, తీగలు మరమ్మతులు చేయాలని అధికారులకు చెప్పిన నిమ్మకు నిరెత్తనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో నెల క్రితం దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంలో అంతర్యమేమిటో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోని వెంటనే మరమ్మతులు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -