- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రగతినగర్ లో కార్పొరేషన్ పరిధిలోని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ విభాగం ఏఈ ఎ.జ్ఞానేశ్వర్లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అధికారుల వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌లోని ఓ ఇంటి వద్ద 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, 3 ఫేజ్కనెక్షన్లు 9 మంజూరు చేయడానికి ఏఈ రూ.50 వేలు డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని బాధితుడు టోల్‌ఫ్రీ నంబర్1064 ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు బుధవారం ఏఈకి రూ.10 వేలు లంచం ఇస్తుండగా రైడ్ చేసి, పట్టుకున్నారు. ఏఈని అరెస్ట్‌చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
- Advertisement -