Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు " విద్యుత్ శాఖ ప్రజాబాట "

క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు ” విద్యుత్ శాఖ ప్రజాబాట “

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కాటారం ఏడిఈ రమేష్ తెలిపారు. మండలంలోని ధన్వాడ, దామెరకుంట గ్రామలల్లో విద్యుత్ సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిష్కారం కొరకు ప్రజా బాట కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాలలో విద్యుత్తుపై అనేక మంది సమస్యలు తలెత్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేందుకు విద్యుత్తు శాఖ “ప్రజా బాట” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొన్ని సమస్యలు వివరించగా వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొందరగా పరిష్కరిస్తామని అన్నారు.

విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు ఉంటే మా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు జరుగుతున్నందున వాటిని నివారించేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వినియోగదారులకు పలు సూచనలు చేశారు. వినియోగదారులు తోడ్పాటు అందించి, సంస్థ అభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఉన్న బకాయి లు వెంటనే చెల్లించాలని, వ్యవసాయదారులు కూడా వారి బకాయిలను చెల్లించి సంస్థకి అభివృద్ధి కి పాటుపడాలని రైతులను కోరారు . ఈ కార్యక్రమంలో ఏ ఈ ఉపేందర్,  విద్యుత్ శాఖ సిబ్బంది, సర్పంచ్ లు రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -