Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు మధ్యలో కరెంట్ స్తంభం.. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం

రోడ్డు మధ్యలో కరెంట్ స్తంభం.. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కొత్త రోడ్డుపై ప్రమాదాల పునాదులు వేస్తోంది. కటాక్షపూర్ నుండి సింగారం వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనుల్లో ఒకవైపు సీసీ రోడ్డు పూర్తి కాగా, మరోవైపు బీటీ రోడ్డు నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభం అయింది .అయితే రహదారిమధ్యలో కరెంట్ స్తంభాన్ని అలాగే వదిలేయడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.వాహనదారులు ఈ మార్గంలో రోజూ వందల సంఖ్యలో ప్రయాణం చేస్తుండగా,

మధ్యలో ఉన్న ఈ స్తంభం ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళల్లో దీని వల్ల తీవ్రమైన ప్రమాదాలు తలెత్తే భయం ప్రజల్లో నెలకొంది. ప్రజలు విద్యుత్ శాఖ, రహదారి శాఖల మధ్య అసమన్వయమే ఈ నిర్లక్ష్యానికి కారణమని తీవ్రంగా విమర్శిస్తున్నారు.“రోడ్డు పనులు ప్రారంభం కంటే ముందే ఈ స్తంభాన్ని తరలించి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే స్పందించి కరెంట్ స్తంభాన్ని తరలించకపోతే పెద్ద ప్రమాదాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులు గళమెత్తుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -