Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త ఏక్‌నాథ్‌ వసంత్‌ చిట్నీస్‌ కన్నుమూత

ప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త ఏక్‌నాథ్‌ వసంత్‌ చిట్నీస్‌ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత ఏక్‌నాథ్‌ వసంత్‌ చిట్నీస్‌ (100) బుధవారం కన్నుమూశారు. చిట్నీస్‌ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈయన భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు. భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఈ కమిటీనే అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)గా రూపాంతరం చెందింది. కేరళలోని తుంబాలో భారతదేశపు మొట్టమొదటి రాకెట్‌ ప్రయోగాని సంబంధించిన స్థలాన్ని ఎంచుకోవడంలో డాక్టర్‌ చిట్నీస్‌ కూడా ప్రధాన పాత్ర పోషించారు. 1981 – 1985 వరకు అహ్మదాబాద్‌లోని ఇస్రో యొక్క స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎస్‌ఎసి)కి ఈయన రెండో డైరెక్టర్‌గా పనిచేశారు. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్‌ విక్రమ్‌ సారాభారు సహచరులలో ఈయన కూడా ఒకరు. డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలామ్‌కు కూడా ఈయనే మార్గనిర్దేశం చేశారు. డాక్టర్‌ చిట్నీస్‌కి కుమారుడు డాక్టర్‌ చేతన్‌ చిట్నీస్‌, కోడలు అంబికా, మనవరాళ్లు తరిణి, చందినీ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -