గగన్ బాబు, కశికా కపూర్ హీరో, హీరోయిన్స్‌గా సత్యం రాజేష్, సాయి రోనఖ్ కీలక పాత్రలలో ఓ సినిమా రూపొందనుంది. ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ఎకె. జంపన్న దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం1గా తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ కొత్త చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా, వివేక్ కూచిభట్ల కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు ఎకె జంపన్నకి నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు స్క్రిప్ట్ ఆందచేశారు. ఫస్ట్‌షాట్‌కు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
డైరెక్టర్ జంపన్న మాట్లాడుతూ,’నిర్మాత కోటేశ్వరరావుతో ఈ కథ చెప్పినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా తానే చేయాలని గోల్డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పెట్టి నిర్మిస్తున్నారు. ఇదొక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. చాలా లేయర్స్ ఉంటాయి. అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతాం’ అని అన్నారు.
‘మా గోల్డెన్ ప్రొడక్షన్స్‌లో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ప్రముఖ నటీనటులందరూ కథ నచ్చి ఇందులో నటించేందుకు అంగీకరించారు. అద్భుతమైన స్టోరీ ఇది. దేశం అంతా మాట్లాడుకునే విధంగా ఉంటుంది’ అని నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు చెప్పారు. హీరో గగన్ మాట్లాడుతూ,’డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అద్భుతమైన ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా కంప్లీట్‌గా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. క్లైమాక్స్ అత్యద్భుతంగా ఉంటుంది. ఇది ప్యూర్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్’ అని తెలిపారు.
‘ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇలాంటి మాస్టర్ పీస్‌లో భాగంగా చాలా ఆనందంగా ఉంది’ అని హీరోయిన్ కశికా కపూర్ చెప్పారు.
ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -