Wednesday, May 7, 2025
Homeరాష్ట్రీయంఅధికారుల కమిటీ ఏర్పాటుపై ఉద్యోగ జేఏసీ హర్షం

అధికారుల కమిటీ ఏర్పాటుపై ఉద్యోగ జేఏసీ హర్షం

- Advertisement -

– నేడు సమస్యలపై చర్చించేందుకు కమిటీతో భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ ఏర్పాటుపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం జేఏసీ చైర్మెన్‌ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ చైర్మెన్‌ నవీన్‌ మిట్టల్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు హైదరాబాద్‌లోని నాంపల్లి సీసీఎల్‌ఏ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై విభాగాల వారీగా చర్చించారు. జేఏసీ నాయకులతో ఐఏఎస్‌ అధికారుల కమిటీ బుధవారం సమావేశమై సమస్యలపై చర్చించనుందని వారు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.రామకృష్ణ, డా.నిర్మల, ఎస్‌.రాములు, బాణాల రాంరెడ్డి, రమేష్‌ పాక, హన్మంతరావు, సీపీఎస్‌ దర్శన్‌ గౌడ్‌, సాల్మన్‌ నాయక్‌, శశిధర్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, రవికుమార్‌, చంద్రశేఖర్‌ గౌడ్‌, హరి కిషన్‌, వెంకట్‌, గోపాల్‌, హబీబ్‌ మస్తాన్‌, లక్ష్మయ్య పులి, హేమలత, సుగంధిని, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -