నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కిష్టావర్ జిల్లా దూల్ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు బలగాలకు పక్కా సమాచారం అందింది.ఆ ఏరియాలో కూంబింగ్ నిర్వహించాయి. బలగాల కూంబింగ్‌ను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తమ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌లో జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES