నవతెలంగాణ-హైదారాబాద్: ఛత్తీస్‌గడ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. గరియాబంద్ జిల్లా పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే సమాచారం మేరకు భద్రతా దళాలు, స్థానిక పోలీసులతో కలిసి శనివారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడ్డారు. దీంతో వీరువర్గాలు పరస్పరం కాల్పులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో ఆయుధాలు, ఇతర ముఖ్యమైన వస్తువులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లుగా గరియాబంద్ ఎస్పీ నిఖిల్ అశోక్ కుమార్ రఖేచా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నట్లుగా ఆయన తెలిపారు. మరోవైపు కర్రెగుట్టలపై భదత్రా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది.
ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్..మావోయిస్టు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES