Wednesday, March 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ, హాస్టల్ పరిసరాల్లో ఈ ఘటన కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఉన్నట్లుండి ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో తోటి విద్యార్థినులు దిగ్భ్రాంతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకుని వసంత మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వసంత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -