Saturday, February 14, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: త‌డ‌బ‌డి నిల‌బ‌డి గెలిచిన ఇంగ్లాండ్

T20 WORLD CUP: త‌డ‌బ‌డి నిల‌బ‌డి గెలిచిన ఇంగ్లాండ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్కాట్లాండ్ టీంపై ఇంగ్లాండ్ జ‌ట్టు తడ‌బ‌డి నిల‌బ‌డి గెలిచింది. 18.2 ఓవ‌ర్లోనే ల‌క్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విక్ట‌రీ సాధించింది. క‌ల‌క‌త్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన‌ స్కాట్లాండ్ 20 ఓవ‌ర్ల‌కు గాను 152 ర‌న్స్ చేసి ఆలౌటైంది. స్కాట్లాండ్ బ్యాట‌ర్లు ఎంఏ జోన్స్ 33, బెరింగ్టన్ 49 ప‌రుగులు చేశారు. బ్రిట‌న్ బౌల‌ర్లు ర‌షీద్ 3 ఆర్చ‌ర్, డాస‌న్ 2, ఓవ‌ర్ ట‌న్, క‌రెన్ త‌లో వికెట్ తీశారు.

ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన ఇంగ్లాండ్ టీం త‌డ‌బ‌డింది. ఓపెన‌ర్లు సాల్ట్, బ‌ట్ల‌ర్ సింగిల్ డిజిట్ ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరారు. ప‌ది ఓవ‌ర్లు ముగిసేరికి ఇంగ్లాండ్ స్కోర్ 4 వికెట్లు కోల్పోయి 86 ర‌న్స్ చేసింది. ఈక్ర‌మంలోనే బెథ‌ల్(32), బాన్ ట‌న్(63) తో క‌లిసి ఇన్నింగ్స్ న‌డిపించాడు. ఇద్ద‌రు క‌లిసి స్కాట్లాండ్ బౌల‌ర్లపై ఎదురుదాడికి ప్ర‌య‌త్నించారు. వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఫోర్లు, సిక్క్ బాదుతూ స్కోర్ బొర్డును ముందుకు న‌డిపించారు. బెథ‌ల్ తొమ్మిదో ఓవ‌ర్లో ఔట్ కాగా, క‌రెన్(22) తో క‌లిసి బాన్‌ట‌న్ అర్థ సెంచ‌రీ పూర్తి చేశాడు. చివ‌ర వ‌ర‌కు క్రీజులో నిలిచిన బాన్‌ట‌న్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. స్కాట్లాండ్ బౌల‌ర్లు మెక్ ములేన్, క‌ర్రీస్, వేల్, లీస్క్‌, డేవిడ్ సన్ త‌లా ఒక్క వికెట్ తీశారు. ఈ విజ‌యంతో ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ గ్రూప్-సిలో నాలుగు పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నంది. ఆడిన మూడు మ్యాచ్‌లో రెండు గెలిచి, ఒక‌టి ఓడింది. వెస్టిండిస్ మొద‌టి స్థానంలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -