Wednesday, July 23, 2025
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి నాలుగో టెస్టు జరగనుంది. తొలి టెస్టు నుంచి రసవత్తరంగా సాగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో బుధవారం నాడు ఓల్డ్ ట్రాఫర్డ్ లో నాలుగో టెస్టుకు తెరలేచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో టీమిండియాలోకి కొత్త ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేస్తున్నాడు. హర్యానాకు చెందిన అన్షుల్ కాంబోజ్ దేశవాళీ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టి మాంచి ఊపుమీదున్నాడు. ఇప్పుడు టెస్టు క్రికెట్ లో అతడు ఎలా రాణిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్ కు దూరం కాగా, పేసర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. అదే సమయంలో వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్ తుదిజట్టుకు ఎంపికయ్యాడు. శార్దూల్ ఠాకూర్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు. అటు, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. గాయపడ్డ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ లియామ్ డాసన్ ను ఎంపిక చేశారు. 
భారత జట్టు
శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్.
ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -