Sunday, May 18, 2025
Homeసినిమావినోదభరితం..

వినోదభరితం..

- Advertisement -

హాస్య నటుడు ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టా రెంట్‌’. వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తు న్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ, ‘మా ట్రైలర్‌ మారుతి చేతుల మీదుగా విడుదల కావడం హ్యపీగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రం’ నా కెరీర్‌ సెట్‌ కావడానికి ఎంతో ఉపయోగపడింది’ అని అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు టైటిల్‌తోనే విజయం సాధించారు. చాలా రోజుల నుంచి ప్రవీణ్‌ను హీరోగా చూడాలనుకుంటున్నాను. ఈ రోజుకు కుదిరింది’ అని అన్నారు. ‘శివ ఈ లైన్‌ చెప్పగానే బాగా నచ్చింది. వెంటనే ఈ పాత్రకు ప్రవీణ్‌ అనుకున్నాం. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది’ నిర్మాత జనార్థన్‌ ఆచారి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -