Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంనేటితో ముగియనున్న ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు

నేటితో ముగియనున్న ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు

- Advertisement -

– రెండోరోజు ఉదయం 93.81 శాతం,
– మధ్యాహ్నం 93.86 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసం వత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించే ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలు ఆదివారంతో ముగుస్తాయి. ఈ మేరకు ఎప్‌సెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ విజరు కుమార్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం మొదటి విడతకు 36,892 మంది దరఖాస్తు చేయగా, 34,607 (93.81 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 2,285 (6.19 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండో విడతకు 36,885 మంది దరఖాస్తు చేస్తే 34,620 (93.86 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని వివరించారు. 2,265 (6.14 శాతం) మంది పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. ఈ పరీక్షలను ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ టి కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ కె వెంకటేశ్వరరావు పర్యవేక్షించారని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -