Tuesday, February 17, 2026
E-PAPER
Homeజిల్లాలుతొర్రూరు మున్సిపాలిటీ కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు క‌న్నీళ్లు

తొర్రూరు మున్సిపాలిటీ కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు క‌న్నీళ్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్కంఠకు తెరదించుతూ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఇరు వర్గాల బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు ‘లక్కీ డ్రా’ పద్ధతిని అనుసరించారు. ఈ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి, రెండో వార్డు సభ్యుడు శ్రవణ్ కుమార్ విజేతగా నిలిచారు. దీంతో ఎన్నికల అధికారి ఆయన పేరును అధికారికంగా ప్రకటించి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన హోరాహోరీ పోరులో చివరకు అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. అయితే, తన రాజకీయ కంచుకోటగా భావించే తొర్రూరు మున్సిపాలిటీ చేజారిపోవడంతో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు.

తొర్రూరులో బీఆర్‌ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తల కష్టాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి?” అంటూ ఆయన కంటతడి పెట్టారు. నాయకులు కేసీఆర్ అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉన్నా, అధికార పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -