Friday, May 16, 2025
Homeజాతీయంప్రత్యేక పోక్సో కోర్టులు ఏర్పాటు చేయండి

ప్రత్యేక పోక్సో కోర్టులు ఏర్పాటు చేయండి

- Advertisement -

– కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ:
చిన్నారులపై జరిగే లైంగికనేరాల కేసులను మాత్రమే ప్రత్యేకంగా విచారించేందుకు పోక్సో కోర్టులను అత్యంత ప్రాధాన్యతా ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా చిన్నారుల రక్షణ (పోక్సో) చట్టం కేసులకు ప్రత్యేక కోర్టుల సంఖ్య ఎక్కువగా లేనందున విచారణలు పూర్తి చేయడానికి చట్టం కింద నిర్దేశించబడిన కాల పరిమితులకు కట్టుబడి వుండడం లేదని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పి.బి.వరాలెలతో కూడిన బెంచ్‌ పేర్కొంది. అందువల్ల పోక్సో కేసులను దర్యాప్తు చేసే అధికారులను చైతన్యపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు బెంచ్‌ పేర్కొంది. అలాగే అధిక ప్రాధాన్యతా ప్రాతిపదికన పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా కోరింది. చట్టంలో నిర్దేశించిన కాలపరిమితి లోపలే విచారణలు పూర్తయ్యేలా చూడడంతో పాటూ నిర్దిష్ట కాల వ్యవధిలోనే చార్జిషీట్‌లు దాఖలు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రం నుంచి అందిన నిధులతో పోక్సో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలనే ఆదేశాలను మెజారిటీ రాష్ట్రాలు పాటించినప్పటికీ తమిళనాడు, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్రల్లో ఇటువంటి కేసులు పెండింగ్‌లో వున్నందున ఇక్కడ మరిన్ని పోక్సో కోర్టులు ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.బాలలపై లైంగికదాడి ఘటనలు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతుండడాన్ని సుమోటో కేసులో సుప్రీంకోర్టు విచారిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. 300కి పైగా కేసులు పెండింగ్‌లో వున్న చోట జిల్లాల్లో రెండు కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలను ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -