Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరైన ఈటల

కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరైన ఈటల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఈటల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్‌ ఆయన్ను ప్రశ్నిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -