Thursday, November 6, 2025
E-PAPER
Homeజిల్లాలుచిన్నపాటి నిర్లక్ష్యం కూడా తగదు: సీఎం రేవంత్‌రెడ్డి

చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తగదు: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.

ఇప్పటికే మంత్రులు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్‌ షోలు నిర్వహించడంతో పాటు కార్నర్‌ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. క్షేత్ర స్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులందరికి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌ రెడ్డి…ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -