Monday, May 5, 2025
Homeరాష్ట్రీయం20 రోజులైనా పడిగాపులే..

20 రోజులైనా పడిగాపులే..

- Advertisement -

– ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాస్తారోకో
– ఖమ్మం జిల్లాలో పలు మార్కెట్‌ యార్టులను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-మధిర/కొణిజర్ల/తల్లాడ

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ, కొణిజర్ల, మధిర మండ లాల్లో శనివారం సీపీఐ(ఎం) నాయ కులు ఆందోళన చేపట్టారు. కొణిజర్ల మండలం పెద్ద గోపతిలో కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి సీపీఐ(ఎం) నాయకులు నిరసన తెలిపారు. సీపీఐ(ఎం) వైరా డివిజన్‌ కార్యదర్శి భూక్య వీరభద్రం రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తల్లాడలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం మార్కెట్‌కు తెచ్చి 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. అధికారుల్లో జవాబుదారి తనం లేదని, రాజకీయ పలుకుబడి ఉంటేనే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల్లో కనీసం మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. వర్షం భయంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. తేమ పేరుతో ఐదు నుంచి పది కిలోల వరకు తరుగు తీయడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం, అధికారులు సహకారంతోనే దోపిడీ జరుగుతోందని తెలిపారు. తేమ శాతం ఉన్నా గన్నీ సంచులు సకాలం ఇవ్వకుండా, కాంటా వేసిన బస్తాలను లారీల్లో పంపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే కొనుగోళ్లు చేయాలని, లేకుంటే రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -