-కొడిచెర్ల తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
-స్పాన్సర్ గా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్
నవతెలంగాణ-కొత్తూరు
సర్పంచ్ గా ఓడినా తాను నిరంతరం ప్రజా సేవలోనే కొనసాగుతానని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ అన్నారు. మండలంలోని కొడి చర్ల తండాలో శనివారం అయన క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ప్రజా క్షేత్రంలో గెలుపోటములు సహజమని ఓడిన తాను నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ ప్రజాసేవలో ముందుంటానని అన్నారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. క్రీడలు స్నేహ స్నేహభావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడలలో పోటీ తత్వం పెంపొందుతుందని, ఐక్యంగా ఉంటూ టోర్నమెంటును విజయవంతం చేయాలని సూచించారు. క్రీడలతో తమ ప్రతిభను చాటి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. సంక్రాంతి పండుగ ముందు ఈ టోర్నమెంట్ ను నిర్వహించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. టోర్నమెంట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న శంకర్ నాయక్ ను క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బిచ్య నాయక్, భాస్కర్ నాయక్, రమేష్ నాయక్, రవి నాయక్, జైపాల్ నాయక్, దక్య నాయక్, కుమార్ నాయక్, శ్రీను నాయక్, దేవు నాయక్, ప్రవీణ్ నాయక్, క్రీడాకారులు, తాండ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
సర్పంచ్ గా ఓడినా ప్రజా సేవలోనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



