Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్ధర్మారం కోతి దేవుడి ఆలయంలో మొక్కులు తీర్చుకున్నా గురడికాపులు

ధర్మారం కోతి దేవుడి ఆలయంలో మొక్కులు తీర్చుకున్నా గురడికాపులు

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ : మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్, పెర్కిట్ ఏరియాలకు చెందిన గురుడికాపు కులస్తులు శనివారం నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చందా మండలం ధర్మారం గ్రామంలోని కోతి దేవుడి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం పంటల సాగుకు ముందు మా ఏరియా కు చెందిన పలువురు రైతులందరం ఈ కోతి దేవుడి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం అనాదికాలం నుంచి వస్తుందని రైతులు చెప్పారు. ఆలయ పరిసరాల్లో సిరా నైవేద్యాలను భక్తిశ్రద్ధలతో తయారుచేసి ఆలయంలోని హనుమాన్ ప్రతిరూపమైన దేవుడికి వేద పండితుడి సమక్షంలో నైవేద్యాలను సమర్పించారు. అనంతరం మురడి కాపు కులస్తులందరూ వంటలు చేసుకుని వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలోనే ఆరగించారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ ఏరియాలోని పలు దేవత మూర్తుల మొక్కులు తీర్చుకున్న తరహాలోనే నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చందా ధర్మారం గ్రామంలో గల కోతి దేవుడి ఆలయంలో సైతం ముక్కులు తీర్చుకొని పంటల సాగును ప్రారంభిస్తామని రైతులు చెప్పారు. రైతులమంతా సాగు చేసే పంటలకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని దేవుడికి మొక్కుకున్నట్లు రైతులు చెప్పారు. కోతి దేవుడి ఆలయానికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన రైతుల్లో అల్లూరి పెద్ద భూమన్న- యమునా, చిన్నవ్వ దంపతులు, యాళ్ల గంగారెడ్డి-పద్మ దంపతులు, ఇట్టెడి మోహన్ రెడ్డి- పద్మ దంపతులు, అల్లూరి మహిపాల్ – లావణ్య దంపతులు, ఇట్టెడి సాయి రెడ్డి – కావ్య దంపతులు, ఇట్టెడి సుమన్ రెడ్డి – మమత రెడ్డి దంపతులు, గోపిడి సుజిత్ రెడ్డి- వసంత రెడ్డి దంపతులు, తదితరులు, కుటుంబాల పెద్దలు నర్సు బాయి, రాజు భాయి, సాయమ్మ వారి కుటుంబాల సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -