Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలి 

ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలి 

- Advertisement -

లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్మోహన్
నవతెలంగాణ – కట్టంగూర్
సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్, స్థానిక సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో గుడిపాటి ధనలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.

నల్లగొండ నవ్య హాస్పిటల్, సూర్యాపేట లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి 50 మందికి ఉచితంగా కళ్ళజోడులు అందించారు. 260 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగే శ్రీనివాసులు,కోఆర్డినేటర్ ఎర్ర శంభు లింగారెడ్డి, క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్,కోశాధికారి పోగుల రాములు, కోఆర్డినేటర్ రెడ్డిపల్లి సాగర్, ఉపాధ్యక్షులు కల్లూరి వెంకన్న, బసవోజు వినోద్, వైద్యులు చెరుకు సుహాస్, ప్రియాంక, పవన్, ఎండి సత్తార్, మేనేజర్ పొడిచేటి నగేష్,గుడిపాటి మురళీధర్, గుడిపాటి రామలింగయ్య, గుడిపాటి శ్రీనివాసులు, వనమా మనోహర్, క్లబ్ సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -