Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అందరూ పాల్గొనాలి

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అందరూ పాల్గొనాలి

- Advertisement -

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు
– 30 రోజుల ప్రణాళికను అమలుచేయాలని ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

జనవరి ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా మాసోత్సవం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. 30 రోజుల ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామని హామీపత్రం ఇవ్వాలని కోరారు. ప్రతిపాఠశాల రోడ్డు భద్రతా క్లబ్‌లో చేరాలని సూచించారు. రవాణా శాఖ సూచనలు పాటించాలనీ, హెల్మెట్‌ ధరించాలనీ, మద్యం తాగి వాహనం నడపరాదనీ, రాంగ్‌ రూట్లో ప్రయాణం చేయకూడదనీ, అతివేగంతో వాహనం నడపొద్దని వివరించారు. రోడ్డు ప్రమాదాల వల్లే మరణాలు అధికంగా జరుగుతున్నాయని అధికారక లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతోపాటు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

30 రోజుల ప్రణాళిక విడుదల
రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా రవాణా శాఖ 30 రోజుల ప్రణాళికను రవాణా శాఖ విడుదల చేసింది. జనవరి ఒకటి నుంచి 31 వరకు వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించింది. ఒకటిన హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో రోడ్డు భద్రతా మాసోత్సవం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీటు బెల్ట్‌ పెట్టుకోవడం, హెల్మెట్‌ ధరించడం, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేయడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. 31న ముగింపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులతోపాటు ఇతరులకు అవార్డులు ఇస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -