నవతెలంగాణ-మల్హర్రావు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి కళాశాల పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు.ఈ సందర్భంగా మండల మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు ఆదివారం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతిభ చాటిన విద్యార్థుల్లో పన్నాల సాత్విక ఎంపిసి ఫస్ట్ ఇయర్లో 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు,జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది.ముడితనపెల్లి అభినవ్ ఎంపిసి ఫస్ట్ ఇయర్లో 448 మార్కులతో కాలేజిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు.రామిడి అనూష ఎంపిసి సెకండ్ ఇయర్లో 974 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచింది.రామిడి సిరి చందన ఎంపిపి సెకండ్ ఇయర్లో 971 మార్కులతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ సందర్భంగా మాజీ ఎంపిపి మాట్లాడారు ప్రభుత్వ కళాశాలలో చదువుతూ,పరిమిత వనరులతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు.విద్యార్థుల కృషిని, అధ్యాపకుల బోధనను ఆయన కొనియాడారు.విద్యార్థులు ఇదే పట్టుదలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,నాయకులు అర్ని ఉదయ్ పటేల్,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మాజీ ఎంపిపి మలహల్ రావు సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



