- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి పరిధిలో జరిగిన కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు విస్త్రృత తనిఖీలు చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడి వివిధ కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి.. నారాయణగూడలోని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం మత్తుమందును కలిపి కల్లు కల్తీ చేసినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసినట్టు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -