నవతెలంగాణ కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం కుస్తీ పోటీలను ప్రారంభించడం జరిగింది. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ తో కలిసి విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో పాల్గొనే మల్ల యోధులు మహారాష్ట్ర లోని నాందేడ్ హిమాయత్ నగర్, బోకర్, మోత్కట్ తో పాటు అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని తానుర్,ముధోల్, బైంసా గ్రామాల మల్లయోధులు అధిక సంఖ్యలో పోటిల్లో పాల్గొని ఈ పోటీల్లో గెలుపొందిన మల్ల యోధులకు మొదటి బహుమతి 6వేలు రెండో బహుమతి 3వేలు నగదును అందజేశారు. ఈ పోటీలను తిలకించేందుకు మండలంలో ఉన్న చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కేరింతలు కొట్టారు. ఈ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుబీర్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్ ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటజీ విజయ్ కుమార్, ఏశాల దత్తత్రి, సూది రాజన్న గంగాధర్, గంగశేఖర్ నాగలింగం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లాయోధులు తదితరులు పాల్గొన్నారు.
ఆలరించిన కుస్తీ పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



