మారుతున్న జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, జంక్ ఫుడ్, కల్తీ ఆహారం వివిధ కారణాలతో మహిళలు చిన్న వయసులోనే పీసీవోఎస్, డయాబెటిక్, థైరాయిడ్, హెర్నియా వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అధిక బరువు కారణంగా ఒబెసిటీ, సంతానలేమి సమస్యలు ప్రస్తుతం సర్వసాధారణమయ్యాయి. పిల్లల కోసం అనేక జంటలు ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే చాలామంది యువతులు పెళ్లికి ముందే అధిక బరువు, ఇతర అనారోగ్య సమస్యలను అదుపులో ఉంచుకునేందుకు జిమ్‌లో చేరి తీవ్రమైన కసరత్తులు, వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు.
జీవన విధానంలో వచ్చిన మార్పు యువతుల్లో హార్మోన్ల అసమతౌల్యం అధికంగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో శరీరంలో మార్పులు, అండాశయం మందమై అండం విడుదల కష్టమవుతుందని తెలిపారు. ఇలాంటి కారణాలతో పిల్లలు పుట్టడం లేదు. వ్యాయామాలు చేయడంతో పాటు జంక్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు తగ్గించి, కూరగాయలు, ఆకుకూరలు, నీటిని అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాయామాలు చేయడంతో హార్మోన్ల అసమతౌల్యం తగ్గుతుందని, దీంతో పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుందని పేర్కొంటున్నారు.
వ్యాయామంతో ప్రయోజనాలు: ప్రస్తుతం చదువు, ఉద్యోగం వివిధ రకాల వల్ల 30 ఏండ్ల వరకు యువతులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక వ్యాయామాలు చేసి దృఢంగా ఉండే వారికి వయసు పైబడినా గర్భం నిలబడే అవకాశం ఉందని, అంతే కాకుండా కాన్పు సులభంగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల పీసీవోఎస్ ఉన్న, అధిక బరువు ఉన్న మహిళల్లో గర్భధారణ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.
పీసీవోఎస్‌కు చెక్: క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి చెడు కొవ్వుతో గుండె, అండాశయంపై పొరలు ఏర్పడవని నిపుణులు అంటున్నారు. శరీరంలోని అవయవాల ఫంక్షనింగ్ మెరుగుపడడంతో పాటు నెలసరి సమయానికి వస్తుందని తెలిపారు. వీటితో పాటు పీసీవోఎస్ సమస్యలను తగ్గిపోవడంతో, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.
జంక్‌ఫుడ్ తగ్గించి: బరువు తగ్గడం వల్ల గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంతే కాకుండా గర్భస్రావం అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. నెలల నిండక ముందే పిల్లలు పుట్టే ప్రమాదమూ ఉండదని పేర్కొన్నారు. పీసీవోఎస్, థైరాయిడ్ ఉన్నవారు బరువు తగ్గితే చికిత్స లేకుండా పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ మందులు వాడాల్సి వచ్చినా ఫలితాలు తొందరగా వస్తాయని వివరించారు. పిల్లలు కనడానికి ముందు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యకరమైన పిల్లలు కలిగే అవకాశమూ ఎక్కువని చెబుతున్నారు.
జుంబా డ్యాన్స్: బరువు తగ్గాలని మహిళలు జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేయడం వల్ల ఎక్కువ మందికి కండరాల నొప్పితో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు బరువులు ఎత్తలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి ‘జుంబా డ్యాన్స్’ సులువైన వ్యాయామం అని నిపుణులు అంటున్నారు. ఎక్కువ మందితో కలిసి డ్యాన్స్ చేయడం వల్ల ఉత్సాహంగానూ ఉంటుందని తెలిపారు.
వ్యాయామం తప్పదు…
- Advertisement -
- Advertisement -