- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. మందుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీసుకొచ్చి పీఎస్‌లో పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసున్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎస్సైతో పాటు పోలీసు వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి పీఎస్‌లోని ఫర్నిచర్, బయట నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. చల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
- Advertisement -



