నవతెలంగాణ-హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో మంగళవారం (ఏప్రిల్ 29) భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పేలుడుకి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన వారిని చాడ గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీకాంత్, పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ లింగస్వామి, ఆత్మకూరు గ్రామానికి చెందిన నరేష్, కుందుకూరి గ్రామానికి మహేందర్, ఆలేరుకు చెందిన బర్ల శ్రీకాంత్, అనాజిపురం గ్రామానికి చెందిన నల్ల మహేష్ గా గుర్తించారు. మిగిలిన వారి సమచారాం తెలియాల్సి ఉంది.
యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. ఏడుగురి పరిస్థితి విషమం
- Advertisement -
RELATED ARTICLES