Tuesday, November 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌లో పేలుళ్లు..12 మంది మృతి

పాక్‌లో పేలుళ్లు..12 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇస్లామాబాద్‌ జి-11 ప్రాంతంలోని జిల్లా, సెషన్స్‌ కోర్టులో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు అని దేశ‌ న్యూస్‌ ఛానెల్‌ డాన్ టీవీ పేర్కొంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. దర్యాప్తు ప్రారంభించినట్లు ఇస్లామాబాద్‌ సీనియర్‌ పోలీస్‌ మీడియాకు వెల్లడించారు. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోల్లో కాలిపోతున్న వాహనం.. ఆ మంటల వల్ల దట్టమైన పొగలు అలుముకున్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. ఈ పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల వరకు వినిపించింది. సంఘటనా స్థలానికి రెస్క్యూ, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని మోహరించాయి. పేలుడు సంబంధించిన వివరాలను గానీ, దాని వెనుక ఉన్న అనుమానితుల్ని కానీ అధికారులు ఇప్పటివరకు బయటకు చెప్పలేదు అని డాన్‌ మీడియా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -