- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లో ఎస్ఐఆర్ పేరుతో ఈసీ సమగ్ర ఓటర్ జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే. కొత్త ఓటర్ జాబితాపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలుంటే వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీలోపు తెలియజేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈక్రమంలో ఈసీ విధించిన గడువును పొడిగించాలని బీహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ తో పటు పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరో వారం రోజులు గడువు పొడిగించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం వచ్చే నెల ఒకటో తారీఖున విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.
- Advertisement -